కోర్టు అరెస్టుకు వరుణ్ రెడీ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఫిలిబిత్ బిజెపి అభ్యర్థి వరుణ్ గాంధీ తనను తాను సమర్థించుకోవడానికి సుప్రీంకోర్టుకు వెళ్లలేదు. తాము సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం లేదని వరుణ్ తరఫు న్యాయవాది రైన్ కరంజేవాలా శుక్రవారం తెలిపారు. వరుణ్ కు ఇచ్చిన ముందస్తు బెయిల్ గడువు శుక్రవారంతో ముగుస్తుంది. ఆయనకు ఢిల్లీ హైకోర్టు ఈ నెల 20వ తేదీన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ గడువు ముగియడంతో ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది.
వరుణ్ గాంధీ కోర్టు అరెస్టుకు అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన శనివారం ఫిలిబిత్ కోర్టులో హాజరు కావచ్చునని అంటున్నారు. ఇది బిజెపి ప్రచారానికి ఇతోధికంగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. తాను ఏమి చేయబోతున్నదీ చెప్పడానికి వరుణ్ నిరాకరించారు. తల్లి మనేకా గాంధీ కూడా తనకు మద్దతు పలికిన నేపథ్యంలో వరుణ్ ఉద్వేగపూరిత అంశంగా మార్చవచ్చునని చెబుతున్నారు. వరుణ్ ప్రతిష్టను దెబ్బ తీయడానికి జరిగిన కుట్రలో కాంగ్రెస్ హస్తం ఉందని మనేకా గాంధీ విమర్శించారు. వరుణ్ వైఖరిని ఆయన పెద్దమ్మ సోనియా గాంధీ సంతానం ప్రియాంక, రాహుల్ తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications