తెలంగాణకు కాంగ్రెసు మోసం: బాబు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు న్యాయపరంగా, చట్టపరంగా, రాజకీయంగా సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తమది ఇచ్చిన మాటకు కట్టుబడే సంప్రదాయమని, కాంగ్రెసు పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో తమపై అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తాము కాంగ్రెసు మాదిరిగా అవకాశవాద రాజకీయాలు చేయబోమని ఆయన అన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణాలను మాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నీటి తీరువాను రద్దు చేస్తామని, బాకీలను కూడా రద్దు చేస్తామని, ఎవరు కూడా బాకీలు ఇప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. కాంగ్రెసు ఇచ్చిన హామీలను వేటినీ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications