40 మంది రెబెల్స్ పై కాంగ్రెస్ వేటు
హైదరాబాద్: అధిష్టానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎన్నికల బరిలో నిలిచిన తిరుగుబాటు అభ్యర్థులపై కాంగ్రెస్ నాయకత్వం మంగళవారం బహిష్కరణ వేటు వేసింది. తమకు టిక్కెట్లు ఇవ్వనందుకు నిరసనగా బరిలో నిలిచి నామినేషన్లు వేసినవారిని ఉపసంహరించుకోవాలని అధిష్టానం ఆదేశించింది. నామినేషన్ల గడువు ముగిసింది. అయినా తొలిదశ ఎన్నికల బరిలో ఉన్న 40 మంది రెబల్స్ ను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారు.
రెబల్స్ ను నామినేషన్లు ఉపసంహరించుకోవాలని కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో మంగళవారం ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి, వాయలార్ రవి, డి. శ్రీనివాస్ సమావేశ మై చర్చలు జరిపి కాంగ్రెస్ రేబల్ అభ్యర్ధులు 40 మందికి ఆరేళ్ళపాటు బహిష్కరణ విధించారు.
బహిష్కరణకు గురైనవారిలో ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి చందా లింగయ్య, ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి జలగం వెంకట్రావ్, పరిగి అసెంబ్లీ అభ్యర్థి టి. రామ్మోహన్‌రెడ్డి, కుత్‌బుల్లాపూర్ అసెంబ్లీ అభ్యర్థిశ్రీశైలం గౌడ్, మల్కాజ్‌గిరి అసెంబ్లీ అభ్యర్థి సూర్యానారాయణరెడ్డి ఉన్నారు. ఆలేరు అసెంబ్లీ తిరుగుబాటు అభ్యర్థి చందర్ రెడ్డి తదితరులు బహిష్కరణకు గురైన వారిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications