వైయస్ వల్లే ఉగ్రవాద అడ్డా: మోడి

వైఎస్ అనుసరిస్తున్న ఓటుబ్యాంకు రాజకీయాల వల్ల కాశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాదుల కన్నా పది రెట్లు హాని చేసే వారు జంటనగరాల్లో చేరిపోయారని నరేంద్ర మోడీ ఆరోపించారు. దేశంలో ఎక్కడ బాంబు పేలినా హైదరాబాద్‌తో సంబంధం ఉండడం ఇందుకు నిదర్శనమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సముద్రతీరంలో తాము గ్యాస్, పెట్రోల్ నిల్వలను వెలికి తీస్తే ఇక్కడి ప్రభుత్వం నిద్రపోయిందన్నారు. ఇక్కడ వెలికి తీసిన సహజసంపదపై ఇక్కడి ప్రజలకు హక్కుందని, దాన్ని తాము గౌరవిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు ప్రకాశ్ జవాదేకర్, బండారు దత్తాత్రేయ, బంగారు లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications