బాబు ఎందుకు అడ్డుకున్నారు?: సోనియా

తమ పార్టీకి మరో పార్టీ సాటి రాదని ఆమె అన్నారు. కాంగ్రెసుకు ఘన చరిత్ర ఉందని ఆమె చెప్పారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ను విమర్శించే అర్హత బిజెపి నాయకుడు ఎల్ కె అద్వానీకి లేదని ఆమె అన్నారు. అద్వానీ హోం మంత్రిగా ఉన్నప్పుడే పార్లమెంటుపై దాడి జరిగిందని ఆమె విమర్శించారు. మూడో కూటమి చిరునామా ఉండదని ఆమె అన్నారు. మూడో కూటమిలోని నాయకులు ఎవరు ఎటు వెళ్తారో తెలియని పరిస్థితి ఉందని ఆమె అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పేదలకు, రైతులకు పలు పథకాలను ప్రకటించి అమలు చేస్తోందని ఆమె చెప్పారు. కాంగ్రెసు పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జరిగినన్నిపనులు మరో ప్రభుత్వం చేయలేదని ఆమె అన్నారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి వివరించారు. చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు.












Click it and Unblock the Notifications