హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం రాష్ట్ర పర్యటనకు విచ్చేశారు. మంగళవారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో ఆమె హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయంలో దిగారు. ఆమెకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వాయలార్ రవి తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆమె హెలికాప్టర్ లో కరీంనగర్ బయలుదేరారు. అక్కడ బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం భువనగిరి బయలుదేరి వెళతారు.ఆ తర్వాత ఆమె విజయనగరం చేరుకుంటారు.