మొరాదాబాద్: మ్యాచ్ ఫిక్సింగ్ అంశం ఎన్నికల్లో ప్రభావం చూపబోదని మొరాదాబాద్ లోక్ సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ క్రికెటర్ మొహ్మద్ అజహరుద్దీన్ వ్యాఖ్యానించారు. ఫిక్సింగ్ కుంభకోణంపై ఎవరికీ ఆసక్తి లేదని, అది ఎన్నికల అంశమే కాదని ఆయన అన్నారు. బుధవారంనాడు ఆయన స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మొరాదాబాద్‌నుంచి అజహర్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఫిక్సింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు.