ఎన్టీఆర్ బుడ్డోడు, వైఎస్ గట్టోడు: భవాని
హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ ను తిట్టినందుకే బుడ్డోడి (జూనియర్ ఎన్టీఆర్)ని దేవుడు క్షమించలేదని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగాభవాని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే పురుగులు పడిపోతారని ప్రజలు చెబుతున్నారన్నారు. వైఎస్‌ది హై వోల్టేజీ బ్యాటరీ అని ఆమె సర్టిఫికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గంగాభవాని మాట్లాడారు. పలు అంశాలపై అనర్గళంగా మాట్లాడారు. ఆమె గతంలో కూడా ఎన్టీఆర్ ను బొడ్డు ఊడని బుడ్డోడు అని అభివర్ణించారు.
ఆ వివరాల్లో ఆమె మాటల్లోనే.."తనకు ఫేస్ వాల్యు లేదని చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌ను తెరపైకి తెచ్చారు. ఎన్నికల ప్రచారంలో బుడ్డోడు వైఎస్‌ను తిట్టారు. వైఎస్ ఊరుకున్నా..దేవుడు క్షమించలేదు. ఇకనైనా ఎన్టీఆర్ మాట్లాడరని అనుకుంటున్నాను. చిన్న ఎన్టీఆర్ ప్రభంజనం చూసి భయం వేసే బాబు తన కొడుకు లోకేశ్‌ను ముందుకు తెచ్చారు. ఒరిజినల్‌గా వారందరి బ్యాటరీలు అయిపోయాయి.
ఒక్క జూనియర్ ఎన్టీఆర్ బ్యాటరీ మాత్రమే పనిచేస్తోంది. వాళ్లందరితో పోలిస్తే..వైఎస్‌ది హై వోల్టేజీ బ్యాటరీ. సూర్యశక్తితో సమానం. జ్యోతిబసులా వైఎస్ కూడా మరో 20 ఏళ్లు రాష్ట్రాన్ని పాలిస్తారు. వైఎస్ ఓ యుగపురుషుడు. కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే ఐదు వేళ్లతో అన్నం తినే వాళ్లంతా పురుగులు పడిపోతారని ప్రజలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications