అగ్నిగుండంగా రాష్ట్రం
హైదరాబాద్: రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. వివిధ జిల్లాలు నిప్పుల గుండంగా మారాయి. వేసవిలో ఇప్పటినుంచే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో రాష్ట్రం అగ్నిగుండంగా మారింది. ఈ వారం అంతా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్, నిజామాబాద్ తదితర పలు జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వీధుల్లో అప్రకటిత కర్ఫ్యూ విధించినట్లవుతోంది. ఉదయం 10 గంటల అనంతరం వీధుల్లో ఎవరూ తిరగటం లేదు. ఈశాన్యరాష్ట్రాల నుంచి వస్తున్న వేడిగాలులే ఇందుకు కారణమని మరికొన్ని రోజులు వేడిగాలులతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications