17 చోట్ల ఘర్షణలు: ఖాన్
హైదరాబాద్: రెండవ విడత ఎన్నికల్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 17 చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయని శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ ఏకే ఖాన్ తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గన్ మెన్ జరిపిన కాల్పులపై విచారణ జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో పోలింగ్ బూత్ ల వద్దే కాకుండా గ్రామాల్లోను భద్రతను కట్టుదిట్టం చేశామని ఖాన్ తెలిపారు. అయితే ఇప్పటివరకు శాంతిభద్రతలకు విఘాతం కలిగి ఎక్కడా పోలింగ్ అగలేదని ఆయన తెలిపారు.
ప్రకాశం జిల్లాలోని ఒక గ్రామంలో బాలినేని శ్రీనివాస రెడ్డి వాహనం తగిలి తెలుగుదేశం కార్యకర్త ఒకతను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వాహనాన్ని అక్కడే వదిలేసి శ్రీనివాస రెడ్డి బైక్ పై వెళ్లిపోయారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చారు.












Click it and Unblock the Notifications