పలు చోట్ల ఇవియంల మొరాయింపు
హైదరాబాద్: రెండో దశ పోలింగ్ జరుగుతున్న జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం ఇవియంలు మొరాయించాయి. దీంతో చాలా చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే పనిచేయని ఇవియంలను వెంటనే బాగు చేసినట్లు, అంతటా పోలింగ్ సక్రమంగా జరుగుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐవి సుబ్బారావు మీడియా ప్రతినిధులతో చెప్పారు.
పశ్చిమగోదావరి జిల్లాలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించటంతో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఏలూరు, భీమవరం, కాళ్లమండలంలోని వేంపాడులలో ఈవీఎంలు మొరాయించాయి. పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు ఉదయాన్నే వచ్చి ఏలూరులోని కేపీడీటీ హైస్కూల్లో ఓటు వేశారు. నెల్లూరు జిల్లాలో అధికశాతం పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్ రెండుగంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఎంతకీ పోలింగ్ ప్రారంభం కాకపోవటంతో పలుచోట్ల స్థానికులు ఆందోళనకు దిగారు.
చిత్తూరు జిల్లాలో ఈరోజు ఉదయం పోలింగ్ ప్రారంభం కాగానే 30 చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. కాళహస్తి, చంద్రగిరి, కుప్పం, తంబళ్లపల్లి మండలాల్లో పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. ప్రకాశం జిల్లాలో ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. పరుచూరు, కనిగిరి, పామూరు, ఒంగోలు, ముక్తి నూతలపాడులలో ఈవీఎంలు చాలాసేపు ఇబ్బందిపెట్టాయి. దీంతో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. కొనకనమిట్ల మండలంలో పోలింగ్ ప్రారంభంలో అల్లర్లు జరిగాయి. చిన్నారికట్లలో టీడీపీ ఏజెంట్‌వద్ద కొందరు ఫారాలు లాక్కుని పరారయ్యారు. చినమనగుండలో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గన్‌మెన్ జరిపిన కాల్పుల్లో టీడీపీ కార్యకర్త మృతిచెందాడంటూ స్థానికులు గన్‌మెన్‌ను నిర్భందించటంతో ఉద్రిక్తద నెలకొంది.
కర్నూలు జిల్లాలో పలుచోట్ల ఈవీఎంలు పనిచేయక పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. బనగానపల్లె నియోజకవర్గంలో ఉదయం 7.30 వరకు పోలింగ్ కేంద్రాలకు యంత్రాలు రాలేదు. కోడుమూరులో ఏ పార్టీ ఏజెంట్లు కూడా రానందున పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. గోనెగండ్లలో ఈవీఎంలు మొరాయించాయి.కడప జిల్లాలో ఒక చోట ఉదయం ఇవియంలు మొరాయించినట్లు ఐవి సుబ్బారావు చెప్పారు. రోజా పోటీ చేస్తున్న చంద్రగిరి నియోజకవర్గంలో ఒక చోట 13 మంది ఓటేసిన తర్వాత కొంత మంది ఇవియంలను ధ్వంసం చేసినట్లు ఆయన చెప్పారు. కొత్త ఇవియంలను ఏర్పాటు చేసిన తర్వాత ఆ 13 మందితో కూడా తిరిగి ఓటేయించినట్లు ఆయన తెలిపారు. అంతటా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు












Click it and Unblock the Notifications