రాజమండ్రి: రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, నటుడు మురళీమోహన్ అతిధిగృహంపై మంగళవారం అర్థరాత్రి దాటాక ఎన్నికల కమిషన్ అధికారులు, పోలీసులు దాడులు చేశారు. రాత్రి 1:30 సమయంలో పడుకున్నవాళ్లను నిద్రలేపి మరీ తనిఖీలు చేశారు. సుమారు గంటన్నరపాటు సోదాలు చేశాక ఏమీ దొరకకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. ప్రచారం ముగిశాక పార్లమెంటరీ పరిధికి చెందని వారు ఉన్నారంటూ మురళీమోహన్ భార్య విజయలక్ష్మి సహా ఆయన సహాయకులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. దీనిపై మురళీమోహన్ మండిపడ్డారు. పోలీసుల చర్య గర్హనీయమన్నారు. నిన్న చిరంజీవి బస చేసిన హోటల్ లో కూడా పోలీసులు సోదాలు చేసి ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే.