జార్ఖండ్ లో హింస: మిగతా చోట్ల ప్రశాంతం
న్యూఢిల్లీ: దేశంలోని 12 రాష్ట్రాల్లో పోలింగ్ భారీగా జరుగుతోంది. దేశంలోని 12 రాష్ట్రాల్లోని 140 లోకసభ స్థానాలకు గురువారం రెండో దశలో పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. జార్ఖండ్ లో మినహా అన్ని రాష్ట్రాల్లో చెదురుమొదురు సంఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. నక్సల్స్ ప్రభావం అధికంగా గల జార్ఖండ్ రాష్ట్రంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి.
నక్సల్ బాంబులు విసరడంతో జార్ఖండ్ లో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ రాజేంద్ర ప్రసాద్, కానిస్టేబుల్ గాయపడ్డారు. గిరిథ్ జిల్లాలోని డాడి - శ్రీరాంపూర్ గ్రామం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. తూర్పు సింగ్భూంలో పోలింగ్ ను అడ్డుకోవడానికి నక్సల్స్ చేసిన ప్రయత్నాన్ని భద్రతా దళాలు తిప్పికొట్టాయి. ఇరు పక్షాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.












Click it and Unblock the Notifications