ఓటమి భయంతోనే దాడులు: టిడిపి
హైదరాబాద్: ఓటమి భయంతోనే కాంగ్రెస్ దాడులకు దిగుతోందని తెలుగుదేశం నాయకులు కె.ఎర్రంనాయుడు, నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాడిపత్రిలో దాడులు మంత్రి జెసి దివాకర్ రెడ్డి ఓడిపోతున్నారని చెప్పడానికి నిదర్శమని వారు శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. దాడులు చేయడం కాంగ్రెసు సంస్కృతి అని వారన్నారు. కాంగ్రెసు వారు నిస్పృహతోనే దాడులకు తెగబడున్నారని వారు ఆరోపించారు.
రాజకీయ పార్టీలు ప్రజల తీర్పును శిరసా వహించాలని వారన్నారు. కాంగ్రెస్ దమన, దహన కాండను తాము ఖండిస్తున్నామని వారు చెప్పారు. కాంగ్రెసుకు వినాశ కాలం దాపురించిందనడానికి ఈ దాడులే నిదర్శనమని వారు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications