శిథిలాల నుంచి బయటపడ్డ రవి
కర్నూలు: కర్నూలు-బెంగుళూర్ జాతీయ రహదారిపై కెసి కెనాల్ మీద నిర్మిస్తున్న వంతెన కూలిపోవడంతో సంభవించిన ప్రమాదం నుంచి రవి అనే బాలుడు బయట పడ్డాడు. జాతీయ రహదారిపై వంతెన కూలడంలో శిథిలాల కింద నలుగురు కూరుకుపోయిన విషయం తెలిసిందే. శిథిలాల కింద కూరుకుపోయిన రవి అనే బాలుడిని అధికారులు క్షేమంగా బయటకు తీశారు.
శిథిలాల కింద కూరుకుపోయిన సతీష్ అనే ఇంజనీరు మరణించినట్లు అనుమానిస్తున్నారు. కాగా, అంజమ్మ, శాంతన్న అనే ఇద్దరు పాలమూరు కూలీలు ఇంకా శిథిలాల కింద ఉన్నారు. రవి శిథిలాల కింది నుంచి చేయి బయటకు పెట్టి తనను రక్షించాలని ఆర్తనాదాలు చేశాడు. శిథిలాల కింది నుంచి రవి చేయి బయటకు కనిపించింది. దాంతో అతన్ని రక్షించడం సులభమైంది.












Click it and Unblock the Notifications