కడప జిల్లాలో ముగ్గురి దారుణ హత్య
కడప: కడప జిల్లాలో గురువారం ముగ్గురు హత్యకు గురయ్యారు. మైదుకూరు మండలం కుమ్మరికొట్టాలలో శ్రీ వెంకటేశ్వర గోడౌన్‌లో గుర్తు తెలియని దుండగులు ఈరోజు తెల్లవారు జామున రాళ్ళతో దాడి చేసి ఆపై గొంతులు కోసి ముగ్గుర్ని హతమార్చారు. మృతుల్లో ఇద్దరు మహిళలు. ఈ సంఘటన స్ధానికంగా సంచనం సృష్టించింది.
గోడౌన్‌లో వస్తువుల దొంగతనానికి వచ్చినట్లు భావించిన వాచ్‌మెన్ నారాయణ వారిని అడ్డుకోవడంతో అతని గొంతుకోసి హతమార్చారు. నారాయణ భార్య ఈశ్వరమ్మను గోడౌన్ ప్రక్కకి తీసుకెళ్ళి సామూహిక అత్యాచారం జరిపి హతమార్చినట్లు తెలియవచ్చింది. మరో వాచ్‌మెన్‌ను కూడా గొంతుకోసి హతమార్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరీశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications