కాలిపోయిన కీలక ఫైళ్ళు
హైదరాబాద్: సచివాలయంలో డీ-బ్లాకులో జరిగిన అగ్ని ప్రమాదంలో కీలకమైన శాఖల డేటా అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తొంది. ఐటీ,ఆర్థిక, రెవిన్యూ, అటవీ, కార్మిక, అగ్రికల్చర్ వంటి శాఖలకు చెందిన కీలకమైన ప్రాజెక్టు ఫైళ్లు, డేటా బేస్ పూర్తిగా దగ్ధం అయినట్లు సమాచారం. దీనిపై అక్కడ ఉన్న అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. కొన్ని కార్యాలయాల డాటా పూర్తిగా దగ్ధం అయినట్లు కన్పిస్తొంది.
ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సమయంలో కీలక శాఖల ఫైళ్ళు, డేటా అగ్నికి ఆహుతి కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డితో చర్చించిన తర్వాత ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశిస్తామని ఆర్ధిక మంత్రి రోశయ్య అన్నారు.












Click it and Unblock the Notifications