వైఎస్ పై కోట్ల సూర్యప్రకాష్ అలక
కర్నూలు: కర్నూలు జిల్లాలో ఓ వివాహకార్యక్రమానికి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి గురువారం కర్నూలు వెళ్ళారు. వైఎస్‌ను కలుసుకోడానికి జిల్లా ఎంపి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ముఖ్యమంత్రి హెలీప్యాడ్ వద్దకు వెళ్ళగా అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది కోట్ల వర్గీయులను అడ్డుకోవడంతో విషయం తెలుసుకున్న సూర్యప్రకాష్‌రెడ్డి కూడా సిఎంను కలవకుండానే వెనుదిరిగారు.
దీనిపై కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలీసు అధికారులు కొంతమందిని విడిచిపెట్టి మా కార్యకర్తలను మాత్రమే అడ్డుకున్నారని, పక్షపాత ధోరణిగా వ్యవహరించారని, గతంలో కూడా ఇలాగే జరిగిందని కోట్ల పేర్కొన్నారు. రాజశేఖర్‌రెడ్డి దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకునేంతవరకు ఊరుకునేది లేదని అన్నారు.












Click it and Unblock the Notifications