నిజాలు తెలుస్తాయనే నిప్పు: టిడిపి
హైదరాబాద్: ఓడిపోతామనే భయంతోనే చేసిన పొరపాట్లను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ సర్కారు ఈ అగ్నిప్రమాదాన్ని సృష్టించి ఉండవచ్చని తెదేపా నాయకుడు లాల్‌జాన్ బాషా అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అగ్నిప్రమాదంపై ఆర్ధికమంత్రి రోశయ్య విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదం వెనుక విద్రోహ చర్య ఉందేమోనన్న కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. ఉద్యోగులు తేరుకోక ముందే మంటలు వ్యాపించడం, వారంతా మంటల్లో చిక్కుకోవడంతో ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర దాగుందేమోనన్న విషయాన్నీ పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఐటి, అటవీ శాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాలు మొత్తం దగ్దమయ్యాయి.












Click it and Unblock the Notifications