అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి
చెన్నయ్: తమిళనాడులో ఈ ఉదయం ఓ అయిల్ మిల్లులో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది మరణించారు. నామక్కల్ జిల్లా వలయంపట్టిలో ఈ ఘటన సంభవించింది. ఈ సంఘటన జరిగిన సమయంలో 30మంది కూలీలు ఉన్నారు. వీరిలో 10 మంది అక్కడిక్కడే మరణిస్తే తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. అయితే మరో 11 మంది ఆచూకీ తెలియటం లేదు. మృతులందరూ బీహార్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications