గుజరాత్ అల్లర్ల విచారణకు జడ్జీలు
అహ్మదాబాద్: 2002 గోద్రా సంఘటన అనంతర అల్లర్ల విచారణకు గుజరాత్ హైకోర్టు శుక్రవారం 9 మంది న్యాయమూర్తులను నియమించింది. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గోద్రా అనంతర అల్లర్లపై విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఈ కేసుల విచారణకు ఏర్పటైన ప్రత్యేక కోర్టులకు హైకోర్టు న్యాయమూర్తులను నియమించింది.
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన తొమ్మిది కోర్టుల్లో నాలుగు అహ్మదాబాదులో, మెహసానా, ఆనంద్ ల్లో రెండేసి, హిమ్మత్ నగర్, సబర్ కాంతాల్లో ఒక్కటేసి కోర్టులు పని చేస్తాయి. ఒక్కో కేసును ఒక్కో కోర్టు విచారిస్తుంది. తొమ్మిది కేసు విచారణపై విధించిన స్టేను సుప్రీంకోర్టు ఈ నెల 1వ తేదీన ఎత్తేసింది. వాటి విచారణకు 9 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications