చిరంజీవిపై అమెరికా డేగకన్ను?
హైదరాబాద్: చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి చెప్పుకోదగినన్ని స్ధానాలు వస్తాయని ఆమెరికా పసిగట్టిందా? భోలక్ పూర్ లో కలుషితనీరు వస్తోందని, చంద్రశేఖరరావు అద్వానీ వెంట వెళ్తారని అందరికంటే ముందే తెలుసుకోగల నెట్ వర్క్ అమెరికన్ ఇంటిలిజెన్స్ వ్యవస్ధకు ఉంటుందని చెబుతుంటారు. భారతదేశంలో అమెరికన్ రాయబారి డేవిడ్ క్యాంప్ బెల్ మల్ ఫోర్డ్ చిరంజీవిని ఆయన నివాసంలో కలుసుకుని రెండు గంటల సేపు రహస్య మంతనాలు జరపడం చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని ఒక తెలుగు న్యూస్ చానల్ మొదట బ్రేక్ చేసింది.
అయితే ఎన్నికల ముందు, ఫలితాల ముందు దేశంలోని ముఖ్యనాయకులను కలుసుకోవడం, బాగోగులు మాట్లాడుకోవడం అమెరికన్ రాయబారుల వృత్తిలో భాగమని ఇందులో విశేషమేమీ లేదని కొందరు విదేశాంగ నిపుణులు తేలిగా తీసుకోమంటున్నారు. కానీ యుపి ఎన్నికల సమయంలో అమెరికన్ రాయబారి ములాయం సింగ్ ను కాకుండా మాయావతితో సుదీర్ఘ మంతనాలు జరిపారని, ఆ ఎన్నికల్లో మాయావతి విజయం సాధించారని, ఇప్పుడు ఆయన చిరంజీవిని కలుసుకోవడం రాష్ట్రంలో రానున్న మార్పునకు సంకేతమా అని ఆ చానల్ ముగించింది












Click it and Unblock the Notifications