తెరాస ప్రభావం లేదు: బర్దన్

AB Bardhan
న్యూఢిల్లీ: తమ నుంచి తెలంగాణ రాష్టర్ సమితి (తెరాస) విడిపోవడం వల్ల తమకు నష్టమేమీ లేదని సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా దాని ప్రభావం ఉండదని ఆయన అన్నారు. తృతీయ కూటమి తగినన్ని స్థానాలు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ కు మద్దతిచ్చే పని చేయబోదని ఆయన అన్నారు. ఈ నెల 16వ తేదీన ఫలితాలు వెలువడిన తర్వాత తాము ఎంత బలంగా ఉన్నామో తెలుస్తుందని, ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని రాష్ట్రపతిని కోరబోతున్నామని ఆయన బుధవారంనాడు అన్నారు.

సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ తో జరిగిన భేటీ తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తృతీయ కూటమి పటిష్టంగా ఉందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి దేబవ్రత్ బిస్వాస్ కూడా పాల్గొన్నారు. సోనియా గాంధీతో జెడి ఎస్ నేత కుమారస్వామి భేటీపై ప్రశ్నించగా తాము తృతీయ కూటమితోనే ఉన్నామని దేవెగౌడ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కూటమి నుంచి జెడిఎస్ వెళ్లిపోలేదని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+