ఎన్డీయెతో జత కట్టను: పాశ్వాన్

కాగా, జెడియు నేత శరద్ యాదవ్, ఆర్ఎల్డీ నేత అజిత్ సింగ్, రాంవిలాస్ పాశ్వాన్ తో మాట్లాడారు. బిజెపి రాజ్యసభ సభ్యురాలు నజ్మా హెప్తుల్లా పాశ్వాన్ ను పలకరించారు. ఎన్డీయెకు తమ పార్టీ మద్దతిచ్చే ప్రసక్తి లేదని ఎల్జెపి సెక్రటరీ జనరల్ అబ్దుల్ ఖాలిక్ స్పష్టం చేశారు. పాశ్వాన్ తో ఎన్డీయె నేతలు మాట్లాడిన విషయానికి ఆయన పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. పాశ్వాన్ ఇంట్లో అగ్ని ప్రమాదానికి వారు పరామర్శించారని, దాంట్లో రాజకీయాలు వెతకాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
కేంద్రంలో లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు ఎల్జెపి, ఎస్పీ, ఆర్జెడీ కలిసి కార్యాచరణ రూపొందిస్తాయని పాశ్వాన్ చెప్పారు. తాను యుపిఎలోనే ఉన్నానని, తాను ప్రభుత్వంలో మంత్రిని కూడా అని ఆయన అన్నారు. యుపిఎకు మెజారిటీ వస్తే సమస్య ఉండదని, రాని పక్షంలో అప్పుడు తమ నాలుగో ఫ్రంట్ లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications