మంత్రులుగా బడుగులు: వైయస్

YS Rajasekhar Reddy
న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రివర్గంలో బలహీన వర్గాలకు 50 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వెల్లడించారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. గతంలో కూడా ఎమ్మెల్యే సీట్లలో తక్కువున్నా మంత్రివర్గంలో బలహీన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించామని గుర్తుచేశారు. రాష్ట్ర మంత్రివర్గం సంఖ్య 43 లోపే ఉంటుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించిన నేపథ్యంలో ఆయన ఆదివారం పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌, కె.వి.పి.రామచంద్రరావు, వై.ఎస్‌.జగన్‌ లతో కలిసి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌లను కలిసి అభినందనలు తెలిపారు. సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు ఎ.పి.భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి కాంగ్రెస్‌కు భారీ సంఖ్యలో ఎంపీ స్థానాలు లభించినా కేంద్రంలో ప్రాధాన్యమైన మంత్రి పదవులు దక్కలేదన్న వాదనను కొట్టిపారేశారు. గతంలో కూడా మంచి పదవులే దక్కాయని, ఈసారి కూడా మంచి ప్రాతినిధ్యం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. మనకన్నా తమిళనాడుకు మంచి పదవులు దక్కాయన్న వాదనతో కొంతమేర ఏకీభవించారు. సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రులను కూడా కలుపుకుపోవాల్సి రావడంవల్ల తమిళనాడుకు కొన్ని ప్రాధాన్య పదవులు దక్కి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. మిత్రులకు మినహాయింపులు ఇవ్వాల్సి వస్తుందని పేర్కొన్నారు.

శాసనసభ ఎన్నికల్లో కులం, మతం, ప్రత్యర్థి అభ్యర్థుల బలం వంటివి బాగా పనిచేయడంవల్లే పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు ఓటమి చవిచూశారని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కొన్నిచోట్ల తమ అభ్యర్థి మంచివాడైనా, బాగా పనిచేసినా స్థానిక సమస్యల కారణంగా ఓడిపోయారన్నారు. డీఎస్‌ ఓడిపోతారని తాను ఊహించలేదని, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా కనిపించలేదన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నాయకత్వం, ప్రభుత్వంపై వ్యతిరేకత లేకపోవడమే విజయానికి ముఖ్యకారణమని విశ్లేషించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకున్న విశ్వసనీయత వల్ల ప్రజల్లో తమ పట్ల సానుకూతల ఏర్పడిందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో స్థానిక సమస్యలు ప్రతిబింబింలేదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అవి ప్రధాన ప్రభావం చూపాయని పేర్కొన్నారు. జగిత్యాలలో తెలుగుదేశం అభ్యర్థి ఎల్‌.రమణ అంతకుముందు వరుసగా ప్రరాపాకు వచ్చిన 15 శాతం ఓట్లలో అన్నీ తమవే అని చెప్పడానికి వీల్లేదని, అలాగని అది పూర్తిగా తెలుగుదేశం ఓటు కూడా కాదని వ్యాఖ్యానించారు. తాము మొదలుపెట్టిన ప్రాణహిత-చేవెళ్లతో సహా ప్రతి సాగునీటి ప్రాజెక్టునూ వచ్చే నాలుగేళ్లలో పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆర్థిక మందగమనం వల్ల కొన్ని సమస్యలున్నా ప్రాజెక్టులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు నిధుల లోటు రాకుండా చూస్తామని పేర్కొన్నారు. తెలంగాణ అంశంపై తాము నియమించిన రోశయ్య కమిటీ పనిచేస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఆ కమిటీ వేయడానికి ప్రధాన కారణం ఒక సమస్యను తీర్చే క్రమంలో మరికొన్ని కొత్త సమస్యలు రాకుండా చూడటమేనని పేర్కొన్నారు. ఆ పరిష్కార మార్గాలు అందరికీ ఆమోదయోగ్యమైతే తప్పనిసరిగా చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+