మావోల దాడి: 16 మంది పోలీసుల మృతి
నాగపూర్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు గురువారం రాత్రి 16 మంది పోలీసులను హత్య చేశారు. మృతి చెందినవారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. గత నాలుగు నెలల కాలంలో మావోలు జరిపిన రెండో అతి పెద్ద దాడి ఇది. రాష్ట్రంలో మావోయిస్టులను అంతం చేస్తామని, బుల్లెట్ కు బుల్లెట్ తోనే సమాధానం చెప్తామని రాష్ట్ర హోం మంత్రి నితిన్ రౌత్ న్నారు.
మావోయిస్టులు పేదలకు సహాయం చేస్తున్నామనే పేరుతో దారుణాలకు పాల్పడుతున్నారని, వారిని సహించబోమని ఆయన అన్నారు. మారుతి జిప్సీ, కమాండర్ జీపుల్లో 16 మంది పోలీసులు వెళ్తుండగా గడ్చిరోలి జిల్లాలోని హట్టిగోటా వద్ద మావోయిస్టులు దాడి చేశారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications