నాకేం అసంతృప్తి లేదు: మహంతి
హైదరాబాద్: డిజిపిగా కొంత కాలమే పని చేయడం వల్ల తనకేమీ అసంతృప్తి లేదని మహంతి అన్నారు. డిజిపిగా మహంతిని తప్పించి ప్రభుత్వం ఎస్ ఎస్పీ యాదవ్ ను నియమించింది. ప్రభుత్వ సూచర మేరకు ఆయన శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనకు సహకరించిన పోలీసులకు, మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో సహకరించిన ప్రజలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను చాలా సంతోషంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. వోటింగ్ శాతం పెరగడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రశంసించినందుకు డిజిపి పదవి నుంచి ఎస్ఎస్పీ యాదవ్ ను ఎన్నికల కమిషన్ తప్పించి ఆ స్థానంలో మహంతిని నియమించింది. తిరిగి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే మహంతిని తప్పించి ఎస్ఎస్పీ యాదవ్ ను డిజిపిగా నియమించింది. ప్రధాన కార్యదర్శికి రిపోర్టు చేయాల్సిందిగా మహంతిని ప్రభుత్వం ఆదేశించింది.












Click it and Unblock the Notifications