పార్టీలో చీలిక సృష్టి: విజయశాంతి

Vijayashanthi
హైదరాబాద్: తమ పార్టీలో చీలిక వస్తుందనే వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సెక్రటరీ జనరల్ విజయశాంతి స్పష్టం చేశారు. కొందరు పని గట్టుకుని పార్టీని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎన్నికల ఫలితాలపై సమీక్షించి, భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకునేందుకు తెరాస సీనియర్ నాయకులు శుక్రవారం సమావేశమయ్యారు. పార్టీ నుంచి ఎవరూ బయటకు వెళ్లడం లేదని విజయశాంతి చెప్పారు.

సమస్యలున్న ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లిపోతే వెళ్లిపోవచ్చునని, మిగతా వారంతా పార్టీతోనే ఉంటారని ఆమె చెప్పారు. రెండు మూడు రోజుల్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని తెరాస శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ చెప్పారు. ఉద్యమానికి రూపకల్పన చేసేందుకు ఈ సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు. పార్టీలో చీలిక వస్తుందనేది సమైక్యవాదుల కుట్ర అని ఆయన విమర్శించారు. ఉద్యమాన్ని ముందుకు తీసికెళ్లేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించుకుంటామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+