హైదరాబాద్: తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై లక్ష్మీపార్వతి మరోసారి నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల్లో ఓడింది తెలుగుదేశం పార్టీ కాదని, చంద్రబాబు నాయుడే అని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి అన్నారు. గురువారం ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ కు చేసిన ద్రోహాన్నీ చంద్రబాబు పశ్చాతాప్తంతో ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారని, అప్పుడే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆమె అన్నారు.