ఒంగోలు: ఎన్నికల ప్రచార సమయంలో కోడ్ ఉల్లంఘించిన కేసులో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి సమన్లు జారీ అయ్యాయి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో చిరంజీవి ప్రచారం చేస్తూ నియమావళిని ఉల్లంఘించారంటూ నమోదైన కేసులో మార్కాపురం కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. రాజకీయ నాయకులపై కోడ్ ఉల్లంఘన కేసులు మామూలే అయినా, న్యాయవాదిని పెట్టుకుని, అవసరమైతే కోర్టుకు హాజరవుతూ ఉంటే పెద్ద సమస్య ఉండదు. మరీ లైట్ గా తీసుకున్నప్పుడు న్యాయమూర్తుల ఆగ్రహాన్ని చవిచూడవలసి ఉంటుంది.