హైదరాబాద్: రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సచివాలయంలో ఘన స్వాగతం లభించింది. బుధవారం ఉదయం ఆయన సచివాలయంలోని తన ఛాంబర్ కి వెళ్లి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఆర్థికమంత్రి రోశయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంతరెడ్డి తదితరుల హజరయ్యారు.