ఆస్ట్రేలియా లో ర్యాలీ..ఇక్కడ ధర్నా
మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియా వరుస దాడులుకు నిరసనగా సిడ్నీలో భారతీయు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నేషనల్ యూనియన్ ఆఫ్ స్టూడెంట్స్ విభాగంతో కలిసి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ ఆసోషియేషన్ నిర్వహించిన ఈ ర్యాలీలో వందాలాది సంఖ్యలో భారతీయులు పాల్గొన్నారు. జాతి వివక్ష దాడులకు వ్యతిరేక నినాదాలు చేస్తూ టౌన్‌హాల్ నుంచి హై పార్క్ వరకూ ర్యాలీగా చేసారు.
ఇక విదేశాల్లోని భారతీయులపై దాడులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత విద్యార్థులపై జరుగుతున్న జాతి వివక్ష దాడులపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత శాంతి సంఘీభావ సంస్థ ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది.
ఈ సమావేశంలో బిజెపీ, ఎంఐఎం మినహా అన్ని పార్టీలు పాల్గొన్నాయి. కొన్నాళ్లుగా దాడులు జరుగుతున్నా,కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయలేదని ప్రజారాజ్యం పార్టీ విమర్శించింది. ఈ నెల 16న ఇదే అంశంపై వారంతా ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు నేతలు తెలిపారు.












Click it and Unblock the Notifications