నేను కొత్త విద్యార్థిని: చిరంజీవి

తన ప్రసంగంలో చిరంజీవి రాష్ట్రంలోని వివిధ వర్గాలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కుంటున్న మంచి నీటి సమస్యను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన అన్నారు. తాము పండుగ చేసుకుంటున్నామని రైతులు అంటున్నప్పుడు మనం మేలు చేసినట్లని ఆయన అన్నారు. రైతులు రోడ్డున పడుతున్నారని ఆయన అన్నారు. రాజకీయాల్లో తాము సామాజిక న్యాయమనే విత్తనం నాటామని, అది మహా వృక్షం అవుతుందని, ఈ విషయంలో తాము విజయం సాధించామని ఆయన అన్నారు. జలయజ్ఞాన్ని తాము సమర్థిస్తామని, దీని కింద చేపట్టిన ప్రాజెక్టులకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారనేది, అవి పూర్తి కావడానికి ఎంత కాలం పడుతుందనేది తెలియదని, అలా కాకుండా ప్రాధాన్యతా క్రమంలో వాటిని చేపట్టాలని ఆయన అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన కాలవ్యవధి గురించి చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications