ఆస్ట్రేలియాలో భారత ర్యాలీలకు స్వస్తి
మెల్బోర్: వీధి ర్యాలీలు ఆపాలని భారత కమ్యూనిటీ నాయకులు ఆస్ట్రేలియాలోని భారత విద్యార్థులకు సూచించారు. ఇప్పటికే తమ ప్రయోజనం నెరవేరిందని, అందువల్ల ప్రశాంతంగా ఉండడం మంచిదని వారన్నారు. తమపై జరుగుతున్న జాతి వివక్ష దాడులకు నిరసనగా భారత విద్యార్థులు గత రాత్రి వరుసగా మూడో రోజు సిడ్నీలోని హారిస్ పార్కులో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలు కొనసాగించాల్సిన అవసరం లేదని అందరూ అంగీకరించినట్లు పెన్నత్ హిల్స్ లో జరిగిన సమావేశానంతరం భారత విద్యార్థుల సమస్యలపై భారత కాన్సుల్ జనరల్ కమ్యూనిటీ కమిటీ సమన్వయకర్త యదు సింగ్ చెప్పారు.
శివారులో సాధారణ జన జీవితానికి ఆటంకంగా మారినందున ర్యాలీలు కొనసాగించాల్సిన అవసరం లేదని భావించినట్లు, ఇప్పటికే తమ ప్రయోజనం నెరవేదరిందని ఆయన అన్నారు. విద్యార్థులు, ఇతర ఆందోళనకారులు అందుకు అంగీకరించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications