ఆందోళన ఉధృతం: జూడాల అరెస్టు
హైదరాబాద్: గాంధీ అస్పత్రి జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను ఉధృతం చేశారు. ఆస్పత్రిపై దాడి చేసినవారి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వారు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం వారు రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ ను అడ్డుకున్నారు. దీంతో హైదరాబాదులోని ముషీరాబాద్ నుంచి బోయిగుడా వరకు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి సికింద్రాబాదులోని చిలకల గుడా పోలీసు స్టేషనుకు తరలించారు.
జూనియర్ డాక్టర్ల సమ్మెకు వైద్యులు మద్దతు ప్రకటించారు. రోజుకు ఒక గంట పాటు విధులను బహిష్కరించాలని సీనియర్ వైద్యులు నిర్ణయించుకున్నారు. సోమవారం నుంచి తమ సమ్మెను మరింత ఉధృతం చేయాలని వారు నిర్ణయించుకున్నారు. గర్భిణీ స్త్రీ మృతితో ఆమె బంధువులు గాంధీ ఆస్పత్రిలో దాడికి దిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications