హైదరాబాదు: తెలంగాణ రాష్ట్ర సమితి అసమ్మతి నేత, వరంగల్ మాజీ ఎంపి, రాష్ట్ర మాజీ మంత్రి రవీంద్ర నాయక్ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుపై ఎస్ సి, ఎస్ టి అట్రాసిటీ కేసును పెట్టారు. తెలంగాణ భవన్ వద్ద అతనిపై టీఆర్ ఎస్ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. కెసిఅర్ ప్రోద్భలంతోనే వారు దాడి చేశారని ఆయన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రవీంద్రనాయక్ గిరిజన తెగకు చెందినవారు. ఇతర సామాజిక వర్గాలకు చెందిన ఎవరైనా ఎస్ సిఎస్ టిల ను దూషించినా, దాడి చేసినా ఆ కేసును న్యాయస్ధానాలు తీవ్రంగా పరిగణిస్తాయి.