హైదరాబాద్: టీఆర్ ఎస్ మాజీ ఎంపీ డి.రవీంద్రనాయక్ పై దాడి జరగటం విచారకరమని పార్టీ అధ్యక్షుడు కెసిఅర్ మంగళవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ భవన్ లో నిన్న జరిగిన దాడి ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. దాడిని ఖండిస్తూ కెసిఅర్ పేరుతో ఓ ఎస్ ఎంఎస్ మీడియాకు చేరింది.
కాగా కెసిఅర్పై పెట్టిన కేసు విత్ డ్రా చేసుకోవాలంటే బహిష్కరణకు గురైన అయిదుగురు నేతలను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని రవీంద్రనాయక్ షరతు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెసిఅర్ పత్రికా ప్రకటన విడుదల చేయటం గమనార్హం.