ఆస్ట్రేలియాకు తెలుగుదేశం టీం
హైదరాబాద్: ఆస్ట్రేలియాలో ఇటీవల వరుస దాడులకు గురవుతున్న భారత విద్యార్థులకు ప్రత్యేకించి తెలుగు వారికి మనో ధైర్యం కల్పించి బాసటగా నిలిచేందుకు టీడీపీ నేతలతో కూడిన బృందం సోమవారం రాత్రి ఆస్ట్రేలియా వెళ్లింది. ఈ బృందంలో టీడీపీ నేత నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఉన్నారు. వీరు మెల్‌బోర్న్, సిడ్నీ నగరాలకు వెళ్ళి అక్కడ భారత విద్యార్థులను కలుస్తారు. ఆ తర్వాత అక్కడి ఉన్నతాధికారులకు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తారు.












Click it and Unblock the Notifications