మ్యాన్ హోల్ లో పడి ఇద్దరి మృతి
విజయవాడ: విజయవాడలోని జమ్మిచెట్టు రోడ్డు వద్ద మ్యాన్ హోల్ లో పడి ఇద్దరు మున్సిపల్ కాంట్రాక్టు సిబ్బంది శుక్రవారం మృతి చెందారు. కాలువను శుభ్రం చేసేందుకు మ్యాన్ హోల్ మూత తెరిచారు. అక్కడ దిగేందుకు ఓ కార్మికుడు మ్యాన్ హోల్ వద్ద కూర్చున్నాడు. ఇంతలో హఠాత్తుగా హోల్ లో పడిపోయాడు. ఇంతలో మరో కార్మికుడ్ని అక్కడ గుమిగూడిన జనం లోపలికి దిగి రక్షించాలని బలవంతం చేశారు. దీంతో రెండో కార్మికుడు కూడా దిగాడు. ఆ తర్వాత ఇద్దరూ బయటకు రాలేకపోయారు.
లోపల విషవాయువులు వెలువడటంతో వారిద్దరూ మరణించి ఉంటారని భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించి ఓ మృతదేహానిన బయటకు తీశారు. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications