కేసీఆర్ ఫినిషింగ్ టచ్..
హైదరాబాద్: కేసీఆర్ ఆడుతున్న రాజీనామా హైడ్రామాకు ఫినిషింగ్ టచ్‌లో భాగంగానే ఫ్రొఫెసర్ జయశంకర్ ఇంటికి కేసీఆర్ వచ్చారని పార్టీ అసమ్మతులు ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల్లో పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారని వారు అభిప్రాయపడ్డారు. ఇదే అభిప్రాయాన్ని వారు ఫ్రొఫెసర్ జయశంకర్ ముందుంచారు.తెరాస అసమ్మతులు ఈరోజు జయశంకర్ నివాసంలో దాదాపు మూడు గంటలు మంతనాలు జరిపారు. ఇంతలో స్థానిక తెరాస కార్యకర్తలు వారిని నిలదీశారు. కేసీఆర్‌పై చేస్తున్న ఆరోపణలను మాని తెలంగాణపై తమ వైఖరేంటో స్పష్టంగా పేర్కొనాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications