చిరును నేను మించాను: ఉండవల్లి
విజయవాడ: ఎన్నికల్లో గెలిచాక తన ఇమేజ్ మెగాస్టార్ చిరంజీవిని మించిపోయిందని రాజమండ్రి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ అ న్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్నపుడు ఎక్కడో మూలనవున్న తనను నాయకులు, కార్యకర్తలు వచ్చి ప్రత్యేకంగా పలకరించడం తబ్బి బ్బు చేసిందని ఆయన చెప్పుకున్నారు.
విజయవాడ బ్రాహ్మణ యువత ఆధ్వర్యంలో మురళీ ఫార్చ్యూన్ హోటల్‌లో ఉండవల్లికి ఆదివారం సత్కారం జరిగింది. ఈ సందర్భం గా ఆయన మాట్లాడారు. బ్రాహ్మణ ఆశీర్వాదం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి శ్రీరామరక్ష కావాలని, వారంతా ఆయనను మనసారా దీవించాలని అ న్నారు. ఈ సందర్భంగా ఉండవల్లి ఈనాడు పత్రికాధిపతి రామోజీరావుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. 1969 నుంచి రామోజీరావు హెచ్‌యుఎఫ్ ఖాతా కింద ఒక్క రూపాయి ఆదాయం పన్ను కట్టలేదన్నారు. ఆయన తన పలుకుబడిని అలా వినియోగించుకున్నారని ఆయన విమర్శించారు. ఎన్‌టీఆర్ బతికుంటే రామోజీరావు పని అప్పుడే ముగిసి ఉండేదన్నారు.












Click it and Unblock the Notifications