హైదరాబాద్: సత్యం కంపెనీ కేసులో నిందితులను పోలీసులు బుధవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. బుధవారంతో వారి రిమాండ్ గడువు పూర్తయింది. దీంతో చంచల్‌గూడ జైలులో ఉన్న రామలింగరాజు సోదరులు, ఇతర నిందితులను బుధవారం కోర్టులో హాజరుపరిచారు.
రామలింగరాజు, ఇతర నిందితుల రిమాండ్ ను కోర్టు జులై 5వరకు పొడిగించింది. అదే విధంగా రామలింగరాజు సోదరులకు సత్యశోధన పరీక్షలు, బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలకోసం సీబీఐ పెట్టుకున్న దరఖాస్తుపై విచారణను ఈనెల 30కు వాయిదావేశారు.