వైయస్ మారలేదు: చంద్రబాబు

ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై దాడుల పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై జరుగుతున్న దాడులను ఆపించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. తెలుగు విద్యార్థులు ఆస్ట్రేలియాలో 30, 35 వేల మంది ఉన్నారని, అయినా దాడుల విషయంలో ముఖ్యమంత్రి వట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఆస్ట్రేలియాకు అఖిల పక్ష బృందాన్ని పంపాలని ఆయన డిమాండ్ చేశారు. తీవ్ర ఆర్థిక మాంద్యం నెలకొని ఉందని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వైస్ రాజశేఖర రెడ్డి ఎన్నికల సంఘం తప్పు పట్టిన వారిని తిరిగి నియమించుకున్నారని ఆయన విమర్శించారు. డిజిపి విషయాన్ని ఆయన ఉదహరించారు. ఎన్నికల సంఘాన్ని సవాల్ చేసే విధంగా రాజశేఖర రెడ్డి వ్యవహరించారని ఆయన అన్నారు. అధికారం వస్తే అణకువగా ఉండాలని తాను సూచించానని, రెండో సారి గెలిచిన తర్వాత వైయస్ మారుతాడని అనుకున్నామని, కానీ మారలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications