మురళీమోహన్ కు మూలారెడ్డి సవాల్
రాజమండ్రి: ఎన్నికల్లో తాను అధికార పార్టీ ప్రలోభాలకు తలొగ్గానని విమర్శించిన రాజమండ్రి లోక్ సభ టీడీపీ అభ్యర్థి మురళీమోహన్, ఆ ఆరోపణలను రుజువుచేస్తే కుటుంబంతో సహా ఆత్మాహుతికి సిద్ధపడతానని అనపర్తి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నల్లమిల్లి మూలారెడ్డి సవాల్ చేశారు. ఈ మేరకు ఆయన మురళీమోహన్ కు లేఖ రాశారు.
బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగిన తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎటువంటి విచారణకైనా తాను సిద్ధమని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మురళీమోహన్ ను, తనను విచారణ జరపాలని కోరారు.












Click it and Unblock the Notifications