మరో భారతీయ విద్యార్థిపై దాడి
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో మరో భారతీయ విద్యార్థిపై జరిగిన దాడి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత వారం జరిగిన ఈ సంఘటనలో ఆ విద్యార్థిని గాయపరచడమే గాక అతని వద్ద నుంచి నగదు, బంగారాన్ని కూడా దుండగులు దోచుకున్నారు. ఈ మేరకు బాధిత విద్యార్థి సచిన్ గురువారం ఆస్ట్రేలియాలోని భారత విద్యార్థుల సమాఖ్య(ఫిసా)కు ఈ-మెయిల్ ద్వారా తెలిపాడు. సచిన్ సదరన్ క్రాస్ కు చెందిన ట్వీడ్‌హెడ్స్ గోల్డ్‌కోస్ట్ విద్యార్థి.Mbr />
కోలంగటా పోలీసు స్టేషను సమీపంలో అతను దాడికి గురయ్యాడు. దాడికి పాల్పడిన దుండగులు అతని వద్ద నుంచి డబ్బు, ఏటీఎం కార్డు, సెల్ ఫోను, బంగారు గొలుసునూ దోచుకున్నారు. దుండగులు దాడి చేసి గాయపరచడంతో సచిన్ ముఖంపై ఐదు కుట్లు పడ్డాయి. ఈ సంఘటనపై పోలీసు కేసు కూడా నమోదైంది.
అయితే పోలీసుల చర్యలపై సచిన్ తన మైయిల్ లో అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారతీయ విద్యార్థులపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో వారిలో విశ్వాసం పాదుకొల్పే చర్యలను భారత దౌత్యకార్యాలయం చేపట్టాలని ఫిసా వ్యవస్థాపకుడు గౌతం గుప్తా సూచించారు.












Click it and Unblock the Notifications