భారత్ తో చర్చలు అనివార్యం: పాక్
ఇస్లామాబాద్: ఇరు దేశాల ప్రయోజనాల దృష్ట్యా భారత్ తో చర్చలు అనివార్యమని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ బాసిత్ అన్నారు. ఈ ప్రాంతంలో శాంతికి, సంపదకు చర్చలు అవసరమని ఆయన అన్నారు. ముంబై ఉగ్రవాద దాడుల నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ తో చర్చలను ఆపేసింది.
ముంబై దాడుల విషయంలో పాకిస్తాన్ సమర్థంగా, పద్ధతిప్రకారం వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు. రష్యాలో భేటీ సందర్భంగా చర్చలను కొనసాగించాలని భారత ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ అంగీకరించారు. ముంబై దాడుల కేసులో అనుమానితులను తమకు అప్పగించాలని, ఈ విషయంలో పాకిస్తాన్ నిర్దిష్టంగా వ్యవహరించాలని, అప్పుడే ఇరు దేశాల మధ్య చర్చలు సాధ్యమవుతాయని భారత్ అంటోంది.












Click it and Unblock the Notifications