ఇద్దరు భారతీయులపై దాడులు
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు ఆగడం లేదు..దాడులను నియంత్రిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇచ్చిన హామీలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ఈసారి ఏకంగా మైనార్టీ కూడా తీరని ఇద్దరు కుర్రాళ్లు భారతీయులను లక్ష్యంగా చేసుకోవటం గమనార్హం. ఆదివారం ఉదయం సిడ్నీలో ఇద్దరు భారతీయ విద్యార్థులపై నిందితులు బీరు సీసాలతో తలపై దాడి చేసి గాయపరిచారు.
నిందితులను పోలీసులు అరెస్టు చేసి రెండు కౌంట్ల అభియోగం మోపారు. వీరిలో ఒకరికి 16 ఏళ్లు కాగా మరో నిందితుడికి 17 ఏళ్ల వయసు మాత్రమే ఉండటం గమనార్హం. జులై 20న బాల నేరస్థుల విచారణ న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నారు. బాధితులు భారతీయులేనని స్థానిక ప్రసార సాధనాలు తెలిపాయి. వీరికి 20 ఏళ్ల వయసు ఉండవచ్చని పేర్కొన్నాయి. సిడ్నీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి పంపించారు.












Click it and Unblock the Notifications