మావోల హెడ్ క్వార్టర్ స్వాధీనం
లాల్ గడ్: కాంటాపహారీలోని మావోయిస్టుల హెడ్ క్వార్టర్ ను ప్రభుత్వ సాయుధ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. గత 12 రోజులుగా సాయుధ బలగాలు మావోయిస్టుల ఏరివేత పని సాగిస్తున్నాయి. ఆందోళన కొనసాగిస్తున్న గిరిజనుల కేంద్ర కార్యాలయాన్ని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పశ్చిమ మిడ్నాపూర్ లో మావోయిస్టులను బలగాలు తిప్పికొట్టాయి.
దక్షిణాది వైపు ఆపరేషన్ సాగించిన బలగాలు రామగడ్ నుంచి ఉత్తరానికి తరలి కాంటాపహారీని స్వాధీనం చేసుకున్నాయి. కాంటాపహారీలోని కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకునే గిరిజనులు స్వయం పాలన సాగిస్తూ వస్తున్నారు. సోమవారం సాయుధ బలగాలకు మావోయిస్టుల నుంచి ఏ విధమైన ప్రతిఘటన కూడా ఎదురు కాలేదు. కాంటాపహారీలో సాయుధ బలగాలు బేస్ క్యాంపును ఏర్పాటు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications