ఆసీస్ లో దాడులపై సుప్రీం అక్షింతలు
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై దాడులు ఆగకపోవడంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై దాడులను నియంత్రించే చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం అంటున్నా దాడులు ఆగలేదని అలాంటప్పుడు ఏం ప్రయోజనమని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ముఖ్యమైన ఈ సమస్యను చుట్టచుట్టి మూలన పడేయలేమని వ్యాఖ్యానించింది. రక్షణకోసం చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టింది.
ఈ నెల మొదటివారంలో దీనిపై అఫిడవిట్ దాఖలుకు కోర్టు ఆదేశించగా ప్రభుత్వం సమర్పించింది. దాడులను ఆపేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని అటార్నీ జనరల్ అనగా సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై సవివరంగా మరో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అస్ట్రేలియా, కెనడాల్లో భారత విద్యార్థులపై దాడులను అరికట్టేందుకు తీసుకున్న చర్యలను అందులో తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications