రాజ్ థాకరేకు బెయిల్ మంజూరు
ముంబై: రైల్వే బోర్టు పరీక్షల సందర్భంగా ఉత్తరాదిపై దాడి కేసులో అరెస్టయిన మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ ఎస్) అధినేత రాజ్ థాకరేకు బెయిల్ మంజూరైంది. కోర్టు ముందు లొంగిపోయిన వెంటనే సోమవారం ఉదయం రాజ్ థాకరేను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు కోర్టు ఆయనను ఈ నెల 13వ తేదీ వరకు జ్యుడిష్యల్ రిమాండ్ కు పంపుతూ ఆదేశాలు జారీ చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుపై కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
ముందస్తు బెయిల్ ను రద్దు చేస్తూ కోర్టు ముందు లొంగిపోవాల్సిందిగా హైకోర్టు జూన్ 16వ తేదీన రాజ్ థాకరేను ఆదేశించిది. దీంతో రాజ్ సోమవారం ఉదయం కోర్టు ముందు లొంగిపోయారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వెంటనే ఆయన తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications